కాంగ్రెస్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం అన్నారు.
విద్యను ఎవరు దోచుకోలేరు, విద్య పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.. ఆ ఉద్దేశంతో విద్యాధన్ ఫౌండేషన్ పని చేయడం అభినందనీయం అని చెప్పుకొచ్చారు. మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా.. బండి సంజయ్ ఉన్నాడా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్.. ఆయన చనిపోతే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళి అర్పించారు అని గుర్తు చేశారు.
Harish Rao: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అని ఎద్దేవా చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు (జనవరి 29) కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కసరత్తు చేస్తున్నారు. నేటి ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ తదితరులు పాల్గొననున్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడని విమర్శించారు.
Sam Pitroda: ఢిల్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘బంగ్లాదేశీ అక్రమ వలసదారుల్ని’’ భారత్‌లోకి రానివ్వాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ మండిపడుతోంది. గతంలో కూడా సామ్ పిట్రోడా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టాయి. లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయులపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వచ్చింది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నాడు.. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు పిచ్చి ప్రవీణ్ అని దుయ్యబట్టారు.
Rythu Maha Dharna: నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వరిసాగులో నంబర్ వన్ స్థాయికి చేరుకున్నదంటే అది సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, చెప్పిన సమయానికి రైతు భరోసా ఇవ్వడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. ఇక నల్లగొండ…