స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ శిత్తశుద్ధితో లేకపోతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఢిల్లీలో ఆప్‌కు, కాంగ్రెస్‌కు అదే ఎదురైందని అన్నారు.
ఖమ్మం జిల్లాలో పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యమని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. అభివృద్ధి చేయలేని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. మరోవైపు.. నిన్న తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని ఏఐసీసీ మార్చింది. కొత్త ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అన్ని జేఏసీ సంఘాలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఏఐసీసీ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఈరోజు (ఫిబ్రవరి 15) పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు.
AICC: పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా కొనసాగుతున్న దీపాదాస్ ను తొలగించిన ఏఐసీసీ.. తెలంగాణకు కొత్త ఇంచార్జిని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీనాక్షి నజరాజన్ 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ లోక్ సభ నుంచి ఎంపీగా…
మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం ఏం చేసిందంటూ అందరూ మాట్లాడుతున్నారని.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వస్తే ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఎం చేసిందో చూపిస్తామన్నారు. గ్రామ పంచాయితీలకు రాష్టం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోడీ…
పార్టీ మారిన వారి పరిస్థితి చూస్తున్నాం అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి ఉండదు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ చాలా హుషారుగా ఉందని, ఎవరు వార్త రాపించారో వాళ్లనే అడగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సర్వే చేసిందని, హైదరాబాద్ గ్రామాల్లో సర్వే ప్రాపర్‌గా జరుగలేదన్నారు. 60 లక్షల మంది ఎక్కడ పోయారో లెక్కలు లేవని తలసాని విమర్శించారు. ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవండని, తమ మీద…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో కులగణన, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. Also Read: Rajat…
తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కులగణన అంశమే హాట్ సబ్జెక్ట్. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించగా... వివిధ కారణాలతో కొందరు పాల్గొనలేకపోయారు. కుదరక కొందరైతే... ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిన వాళ్ళు మరి కొందరు. అలా వివరాలు ఇవ్వని వారికోసం మరోసారి సర్వే చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఈ విషయంలో కూడా రాజకీయాలు మొదలయ్యాయి.