కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్ మాట్లాడుతూ… సుప్రీంకోర్టు పరిశీలనను తప్పించుకోవడానికి.. తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇటువంటి చర్యతో ఎన్నికల ప్రక్రియపై సందేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు కేసీ.వేణుగోపాల్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు.
ఇది కూడా చదవండి: MouniRoy : బికినీలో మౌని రాయ్.. మాములుగా లేదోయ్..
‘‘సీఈసీ నియామకం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సీఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించడంపై ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే కొత్త సీఈసీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు పరిశీలన లేకుండా సీఈసీని నియమించాలనే తొందరపాటు కేంద్ర ప్రభుత్వ చర్యలో భాగంగా కనిపిస్తోంది.’’ అని కాంగ్రెస్ తెలిపింది.
‘‘ఈ తొందరపాటు చర్యతో ఎన్నికల ప్రక్రియను బీజేపీ ఎంత నాశనం చేస్తోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యల వల్ల నకిలీ ఓటర్ల జాబితా, బీజేపీ అనుకూల ఎన్నికల షెడ్యూల్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు బలపడతాయి’. అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కొత్త సీఈసీగా జ్ఞానేష్‌కుమార్ సోమవారం నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుడికి అస్వస్థత.. చికిత్స పొందుతూ మృతి!