అలహాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దళిత నాయకుడు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఘోర అవమానం జరిగిందని చర్చ జరుగుతోంది. సమావేశంలో ఆయనకు ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్యలో సోఫాలో కూర్చున్నారని బీజేపీ ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా ఈ అంశాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. “మొదట ఖర్గే…
Congress: కాంగ్రెస్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో జార్జ్ సోరోస్‌తో సంబంధాలు, రాహుల్ గాంధీ ఎంపీలను తోసివేయడం వంటి అంశాలపై బీజేపీ ఆ పార్టీని కార్నర్ చేసింది. తాజాగా కాంగ్రెస్ ‘‘భారతదేశ మ్యాపు’’ని వక్రీకరించడం వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాపుని పోస్టర్లుగా వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
CWC meeting: కర్ణాటకలోని బెలగావిలో నేడు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు.
ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రకటించారు.
త్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
Congress Working Committee To Meet On Sunday: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఈ నెల 28న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం అవుతోంది. ఆగస్టు 28, మధ్యాహ్నం 3.30 గంటలకు సోనియా అధ్యక్షతన వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ…
కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఓటములు తప్పడంలేదు.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని ఖంగుతినిపించాయి.. ఐదుకు ఐదు రాష్ట్రాల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది.. మరోవైపు జీ23 నేతల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామా చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామాలు…