అలహాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దళిత నాయకుడు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఘోర అవమానం జరిగిందని చర్చ జరుగుతోంది. సమావేశంలో ఆయనకు ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్యలో సోఫాలో కూర్చున్నారని బీజేపీ ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా ఈ అంశాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. “మొదట ఖర్గే జీని గౌరవించడం నేర్చుకోండి. ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు. తన కుర్చీని పక్కన పెట్టడం ఏంటి? దీన్ని బట్టి కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని స్పష్టంగా తెలుస్తుంది.” అని రాసుకొచ్చారు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ.. భారతీయ జనతా పార్టీ మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ దళిత వ్యతిరేక రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
READ MORE: GT vs RR: పాయింట్స్ టేబుల్ టాపర్గా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుందా? మొదట బౌలింగ్ చేయనున్న ఆర్ఆర్
నిజానికి, ఈ విషయం దళిత వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి లభించినంత మర్యాద మరెవరికీ లభించదనేది నిజం. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం కాకుండా వేరే అధ్యక్షుడిని ఎన్నుకున్నా.. మర్యాద మాత్రం ఆ స్థాయిలో ఉండదనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అప్పటి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి గెహ్లాట్ అధ్యక్షుడైనా, థరూర్ అయినా… వారు కేవలం తోలుబొమ్మలు మాత్రమే అవుతారని ఆయన ఆరోపించారు. పార్టీ ఆదేశం రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఖర్గేను అవమానించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టత రాలేదు. హైకమాండ్ ఏ విధమైన సమాచారం ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.
पहले खड़गे जी का सम्मान करना सीखो। वह कांग्रेस के राष्ट्रीय अध्यक्ष हैं। उनकी कुर्सी किनारे पर लगाने का क्या मतलब था? यह साफ़ दर्शाता है कि कांग्रेस दलित विरोधी है। https://t.co/cPtZUJXUFB pic.twitter.com/6u4kZYxcsN
— Amit Malviya (@amitmalviya) April 9, 2025