ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. జూన్ 8న ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ హెచ్‌క్యూలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కమిటీలో ఉన్న నేతలంగా హాజరుకానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: నీటి విషయంలో “రాజకీయాలు వద్దు”.. విడుదల చేయాలని సుప్రీం ఆదేశం
తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి అత్యధిక సీట్లను సంపాదించింది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకుంది. ఈసారి ప్రతిపక్ష హోదాను సంపాదించింది. ఇక పార్లమెంట్‌లో ప్రతిపక్ష పాత్రను పోషించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకువస్తుంది..?