Bhatti Vikramarka : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. శాసనసభకు వచ్చే ధైర్యం లేని వారు, బయట ఉండి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 85…
CM Revanth Reddy : దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చిన కేసీఆర్, తన పాత పద్ధతిని మార్చుకోకుండా మళ్ళీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. ఓటమితోనైనా కేసీఆర్ మారుతారని ఆశించానని, కానీ ఆయన తీరు మారలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని…
Uttam Kumar Reddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని పదేళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ విమర్శలకు మంత్రి లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తన హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి,…
KCR: తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు తదితరులు హాజరుకానున్నారు. మొత్తం సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ పార్టీ కేంద్ర…
Kadiyam Srihari: నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. మరోవైపు, స్పీకర్ గడ్డం ప్రసాద్.. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల వివరణ తీసుకుంటున్న సమయంలో.. తన రాజీనామాపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన కడియం శ్రీహరి.. నేను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు.. అయితే, స్పీకర్ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ఉంటుందని.. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల…
మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్‌లు ఆటంబాంబుల్లా రీసౌండ్‌నిస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతకర భాష శ్రుతిమించుతోందా?.. జూబ్లీహిల్స్ ఎన్నికలో మూడు పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా? జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీగల్లీ చుట్టేస్తూ..రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…లాంగ్వేజ్‌ని మరో లెవెల్ కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు…
Kishan Reddy: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాకిస్థాన్‌లో పేలని బాంబులు, జూబ్లీ హిల్స్‌లో పేలుతాయని రేవంత్ అవమానకరంగా మాట్లాడారన్నారు. మీ మీద కార్పెట్ బాంబు దాడులు జరుగుతాయన్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చనప్పుడు మా కార్పెట్ బాంబులు దాడులు ఉంటాయని తెలిపారు. మీ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మా కార్పెట్ బాంబులు పేలుతూనే ఉంటాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో రోడ్లు లేవు, మొత్తం గుంతలే.. పరిశుభ్రత లేదు, రోడ్ల పైన…
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు.. మీలాగా మాటలు కాదు, చేతల ప్రభుత్వం మాది అని విమర్శించారు. విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం అని, శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోయిన హాస్పిటల్స్ ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని అన్నారు. మీ ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయి పెట్టిపోతే.. తాము చెల్లిస్తున్నాంఅని మండిపడ్డారు. నిత్యం మా ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనదు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ న్యాయ కోవిధుడు అని, ఆయనకు మద్దతు ఇవ్వకపోవడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయలేమని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్ మారిందని, ఇంటి లొల్లిలకే పార్టీ పెద్దలకు సరిపోతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని ఎంపీ చామల…