కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 19న తన 55వ పుట్టినరోజును అత్యంత సరళంగా జరుపుకున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. రాహుల్ తన నివాసం 24 అక్బర్ రోడ్లో కార్యకర్తలు, నాయకులను కలిశారు. అక్కడ వాళ్లు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడానికి నిరాకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్. ఉందా.. లేదా అన్నట్టుగా... ఉండీ లేనట్టుగా... అలా అలా బండి లాగించేస్తున్న పార్టీ. అసలు ఒంట్లో బలం ఉందా లేదా అన్నదాంతో... సంబంధం లేకుండా సహజంగా వచ్చే డీఎన్ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ని కూడా వేధిస్తున్నాయట. ఐకమత్యం, అందర్నీ కలుపుకునిపోవడం, కలిసి పనిచేయడంలాంటిని కాంగ్రెస్‌లో పెద్దగా కనిపించని లక్షణాలు.
CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది. Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి रवానవుతారు. అక్కడ ఆయన ఏఐసీసీ (AICC) నేతలను కలిసి, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల కేటాయింపు, పార్టీ కార్యవర్గ విస్తరణపై కీలక చర్చలు జరపనున్నారు. ఇటీవల కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. Water Storage at Dams:…
Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ మునుపటి నుండి స్పష్టమైన స్థానం తీసుకుందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తప్పు అని జగమెరిగిన సత్యమని, అప్పట్లో ఈటల రాజేందర్ కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఆయన అవినీతిపై మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని జగ్గారెడ్డి…
TPCC Mahesh Goud : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్‌లో ఆంతర్య విభేదాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిపై ఆయన పార్టీ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీవ్ర ఆక్షేపాలు చేశారు. పార్టీ క్షమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న మల్లు రవి, పార్టీ లైన్‌ను దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయ్తో కలసి తిరుగుతున్నారని సంపత్ ఆరోపిస్తూ, ఈ విషయాన్ని ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. Gautam Gambhir: “రోడ్‌షోలు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ అంతకంతకు పెరుగుతోందట. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మధ్య గ్యాప్ ఎక్కువ అవుతోందంటున్నారు. జిల్లాలో పార్టీకి అయ్యా అవ్వా లేరంటూ ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మరో మాజీ మంత్రి సైతం అధికార పార్టీలో ఉండి అధికారులపైనే విమర్శలు చేశారు. ముఖ్యంగా... సిర్పూర్, ముథోల్ ,మంచిర్యాల నియోజకవర్గాల్లో గ్రూప్ లొల్లి తారా స్థాయికి చేరిందట.
పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు.
Mallu Ravi : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రేపటితో (జూన్ 2) 11వ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మల్లు రవి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ కార్యక్రమాలను వివరించారు. మల్లు రవి మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గత ప్రభుత్వాలు…
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. షాద్ నగర్ లో మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న TG 38 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుంచి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. ఈ…