అధికారం పోగానే పార్టీని వదిలేయడం, తిరిగి పవర్ రాగానే ఘర్ వాపసీ అనడం సమకాలీన రాజకీయాల్లో సహజమైపోయింది. అంతా మా ఇష్టం అన్నట్టుగా జంపింగ్ జపాంగ్‌లు గెంతులేస్తుంటే... అటు రాజకీయ పార్టీలు కూడా రకరకాల కారణాలు, అవసరాలతో ఇలాంటి బ్యాచ్‌ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి చేరడం చాలామందికి పరిపాటిగా మారింది.
PM Modi: భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు.
Off The Record: జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం మరోసారి హీటెక్కింది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే టార్గెట్‌గా మళ్లీ నిప్పులు కురిపించారు. దీంతో ఆయన, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తాజాగా మాటల యుద్దం షురూ అయింది. జగిత్యాల ప్రజల కోసం నూకపల్లి అర్బన్ కాలనీలో ఇళ్ళ నిర్మాణం కేంద్రంగా ఈ వివాదం మొదలైంది. తన హయాంలో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేయగా.. అసంపూర్తిగా…
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించినప్పుడు తాము తీసుకున్న నిర్ణయాలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆమె ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువల సర్పణ” అని ఆమె పేర్కొన్నారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని.. మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరమన్నారు.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24వ తేదీన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం కానుంది. అనంతరం పీసీసీ సలహా కమిటీ (పీసీసీ అడ్వజరీ కమిటీ పీఏసీ) సమావేశాలు జరగనున్నాయి.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాలతో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ఈ రోజు హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, పార్టీ వ్యూహాలను సిద్ధం చేయడం, కేంద్ర మంత్రులతో రాష్ట్రాభివృద్ధిపై చర్చించడం వంటి అనేక అంశాలపై ఆయన ఢిల్లీలో సమాలోచనలు నిర్వహించారు. కేంద్రంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో త్వరలో…
కొద్ది రోజుల కిందట సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఈరోజు గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.