CM Revanth Reddy : హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో కీలక భేటీలు
- స్థానిక ఎన్నికలపై ఢిల్లీలో చర్చలు
- బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆలోచన
- టోనీ బ్లెయిర్‌తో రేవంత్ ప్రత్యేక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాలతో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ఈ రోజు హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, పార్టీ వ్యూహాలను సిద్ధం చేయడం, కేంద్ర మంత్రులతో రాష్ట్రాభివృద్ధిపై చర్చించడం వంటి అనేక అంశాలపై ఆయన ఢిల్లీలో సమాలోచనలు నిర్వహించారు.
కేంద్రంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నెక్టరవ్యూలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనపై అధిష్ఠానంతో చర్చించనున్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కేవలం ఎన్నికల వ్యూహంపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని సమాచారం. ముఖ్యంగా కులగణన అంశాన్ని జాతీయ అంశంగా మలచాలని, రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన అనుభవంతో కేంద్రాన్ని ప్రభావితం చేయాలనే లక్ష్యం ఆయనది.
YS Jagan: వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత!
ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో రైతులు, యువత, మహిళలు తదితర వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ‘తెలంగాణ రైజింగ్ 2047’ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టోనీ బ్లెయిర్ స్థాపించిన “ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్”తో తెలంగాణ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకోవడం ద్వారా భవిష్యత్ వ్యూహాలకు మద్దతు కూడగట్టే దిశగా అడుగులు వేసింది.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌లతో కూడా సీఎం రేవంత్ సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. రూ.24,269 కోట్ల విలువైన 76.4 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ సంవత్సరం డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనుండగా, “ప్రోగ్రెస్ రిపోర్ట్” ను ప్రజల ముందుంచే కార్యక్రమాన్ని, భారీ బహిరంగ సభల ద్వారా ప్రారంభించాలన్నది సీఎం ఆలోచన. ఈ సభలకు ముఖ్య అతిథులుగా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లను ఆహ్వానించేందుకు సమయాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నారు.
Marriage: కొడుకుతో నిశ్చితార్థం.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న మామ.. అసలు ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!