తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ పథకాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఏడు సంవత్సరాల నుంచి అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు పథకాన్ని ఆపివేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి బట్టే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదును తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Read Also: China: చైనాలో ఏం జరుగుతోంది..? రక్షణ, విదేశాంగ మంత్రుల తొలగింపు..
రైతు బంధును ఆపేయాలని ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం దుర్మార్గానికి పరాకాష్ట అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఈసీకి ఫిర్యాదుతో తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ మరోసారి బట్టబయలైంది అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ చర్యలపై ప్రజలు ఉద్యమించి, తిరగబడాలి, గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయాలి అని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తీరు ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ కూడా ఆపేలా ఉంది అంటూ ఆయన వెల్లడించారు. కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. తెలంగాణ మోడల్ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ కి భయం పట్టుకుంది అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Motorola’s Bendable Phone: మోటోరోలా నుంచి మరో కొత్త ఫోన్..ఫీచర్స్ అదుర్స్..
కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసళ్ళు వదిలే దుస్థితి వచ్చింది అని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవు.. ఇక్కడ కేసీఆర్ పథకాలు ఆపేస్తే దేశంలో ఎక్కడా పంచాయతీ ఉండదని కుట్ర చేస్తున్నారు.. కాంగ్రెస్, బీజేపీల అజెండా ఒక్కటే.. కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేసే అభ్యర్ధులని ఇచ్చి పుచ్చుకుంటున్నారు అంటూ మంత్రి జగదీష్ ఆరోపించారు.