Manickam Tagore: రెండు సార్లు చంద్రబాబు పాలన, ఒక్క సారి వైఎస్ జగన్ పాలనను చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్.. కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా టీంతో క్షేత్రస్ధాయి కార్యాచరణపై చర్చించాం.. మండల స్ధాయిలో కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా ఆవశ్యకత ఉందన్నారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు, జగన్ లను చూసిన ప్రజలు.. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు..
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
ఏపీలోని రాజకీయ నేతలు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలను పోల్చిన ఠాకూర్.. బీ ఆంటే బాబు, పీ అంటే పవన్, జే అంటే జగన్.. ఏపీలోని ఈ కొత్త బీజేపీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏపీ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. సంక్రాంతి తర్వాత ఎన్నికలకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ స్థానాలు గెలుస్తాం అనే ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఒంగోలులో నిరుద్యోగ యువత ధర్నాలో పాల్గొంటాను.. డీసీసీ సమావేశం నిర్వహించి ఇవాళ, రేపు ఉదయం ఏపీలో ఉంటానని తెలిపారు. క్షేత్రస్ధాయిలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల విషయంలో బలమైన ప్రణాళికలు చేస్తున్నట్టు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాకూర్. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మళ్లీ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది.. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వారితో పాటు.. ఇతర పార్టీల వారిని కూడా ఆహ్వానించేపనిలో పడిపోయిన విషయం విదితమే.