TG High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్‌కు ఉందని సూచించింది.
Harish Rao: కాంగ్రెస్ పార్టీ రైతుల ధాన్యం అమ్మకాలపై రివ్యూ చేయడం లేదని బిఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎక్కడెక్కడ తక్కువ మందు అమ్ముతున్నారు అని దానిపై మాత్రమే రివ్యూలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు. సీఎం రేవంత్‌ని వ్యతిరేకించిన అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు... ఆ విషయం తెలుసు అన్నారు.
అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించండి... ఇండియా కూటమి అభ్యర్థులను తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు.
Harish Rao: కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
ఇందిరాభవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు.
అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మాణం జరగబోతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పిలుపు మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, రాహుల్ గాంధీ పిలుపు మేరకు కులగణన గత ఎన్నికల్లో పిలుపునిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగనన చేపడుతామని హామీ మేరకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామని ఆయన తెలిపారు.
KTR Tweet: తెలంగాణ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని మండిపడ్డారు