Kadiyam Srihari : వరంగల్ జిల్లా మడికొండ సత్యసాయి గార్డెన్ లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజాపాలన విజయోత్సవ సభకు అధ్యక్షత వహించారు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యలు హజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 15సంవత్సరాలుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెనుకబదిందని దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి నన్ను గెలిపించాలని కోరానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత స్టేషన్ ఘనపూర్ మళ్ళీ అభివృద్ధి జరగదని నేను అనుకుంటే నాకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కి రావాలని కోరారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లో చేరిన తర్వాత పార్ల ఎన్నికల్లో కావ్యాకు టికెట్ ఇచ్చారని, నన్ను కావ్యను సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్లు దూషించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి 750కోట్లు నిధులు సీఎం కేటాయించారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. లీడర్ అనే నాయకుడు గ్రామాల్లో ఉంటూ గ్రామ సమస్యలు తెలుసుకొని గ్రామ స్థాయిలో ఉంటేనే టికెట్.. లేదంటే..నన్ను కలిసిన ప్రయోజనం ఉండదని, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్బాన్ని 6అబద్ధాలు, 66మోసాలు, 100రోజుల పాలనా అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.
Acharya Pramod Krishnam: 15 ఏళ్లలో రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ని అంతం చేశాడు..
దేశంలో ఎక్కడా లేని విదంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ కి దక్కింది.హరీష్ రావు కు సవాల్ చేస్తున్న రైతులకు రుణమాఫీ చేయలేదని చెప్పగలావా ? అని ఆయన ప్రశ్నించారు. సన్నాలు పండించిన పంటలకు 500బోనస్ ఇస్తుంది. ఒక సంవత్సరం లో 55వేళా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగం వచ్చింది.అధికారంలో వచ్చిన తరువాత వేళా కోట్ల రూపాయలు వెనుక వేసుకున్నారు. ధరణి, లిక్కర్ ,కాళేశ్వరం ప్రాజెక్టు లో దోసుకున్న డబ్బులు ఇంతఅంత కాదు. ఇంత అవినీతి చేసిన కల్వకుంట్ల కుటుంభం, వారు చేసిన వాటిని నేను స్వయంగా చూస్తే, ఇలాంటి వాటిలో నేను ఉండలేను అంటి కాంగ్రెస్ పార్టీ లో కి వచ్చాను.2014లో మీ ఆస్తులు ఎంత ,అధికారం పోయిన తర్వాత మీ ఆస్తులు ఎంత, అందుకే కెటిర్ అంటాడు.. నేను జైలు కు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అంటే తప్పు చేస్తేనే ఇలాంటి ప్రకటన లు చేస్తున్నావు. నా వద్దకు ఎవరు రారు..నా మీద ఏ పోలిస్ స్టేషన్ లో కేసు లేదు. బీజేపీ,బీఆర్ఎస్ రెండు పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు.యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పై అసత్య ప్రచారాలు చేస్తుంటే ,కాంగ్రెస్ కార్యకర్తలు అందించాలి.’ అని కడియం శ్రీహరి అన్నారు.
Teacher MLC : రేపు కాకినాడ జేఎన్టీయూలో టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్