TPCC Mahesh Goud : కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు
- సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
- హరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్
- మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి
- మేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాం : మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు. సీఎం రేవంత్‌ని వ్యతిరేకించిన అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు… ఆ విషయం తెలుసు అన్నారు. మీకు ఆ హక్కుంది.. మేము మీకు అండగా ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు. మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి.. మేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామని హరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మన ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అవన్నీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలన్నా మహేష్ గౌడ్. జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయన్నారు.
Bengaluru: అమెజాన్ హెడ్‌క్వార్టర్స్ తరలింపు.. తీవ్ర అసంతృప్తిలో ఉద్యోగులు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని, కార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందేనని ఆయన అన్నారు. మరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందన్నారు. అంతేకాకుండా..బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదని, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్‌ఎస్ ఉండదన్నారు మహేష్ గౌడ్. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడని, చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరని ఆయన వ్యాఖ్యానించారు.
Pawan Kalyan: మహారాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ హామీలు.. వీలైనంత త్వరగా అమలు చేస్తాం..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!