Kharge Serious On MLAs: హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీరియస్ అయ్యారు.
మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తిని తగ్గించకపోగా... సెగలు పొగలు మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో.. ఆశావహుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతోందట. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. ఇంకో మూడు పెండింగ్‌లో ఉన్నాయి.
అది కంపెనీ అయినా... రాజకీయ పార్టీ అయినా... పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం, ఆచరించడమన్నది సహజ లక్షణం. ముందు చెప్పింది చేయడం మొదలుపెడితే... తర్వాత వేసే అడుగుల్లో... నాయకుల దిశా నిర్దేశం ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ విషయం బోధపడటం లేదట. పదే పదే నాయకత్వం సలహాలు..సూచనలు ఇస్తున్నా... ఆ స్థితి దాటి ఆదేశాల వరకు వెళ్ళినా సరే... కింది నాయకుల తీరు మారడం లేదంటున్నారు.
CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశం నేడు (మంగళవారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లే దిశగా చర్చలు సాగనున్నాయి. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.., జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రంలోని మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండి ప్రభుత్వ పథకాలను వివరించేందుకు…
Congress: తెలంగాణ అసెంబ్లీ మాజీ మత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. బీఆర్ఎస్ అహంకారం ఇంకా తగ్గలేదు.. బీఆర్ఎస్ పార్టీకి దళిత స్పీకర్ పై గౌరవం లేదు అన్నారు. దళిత స్పీకర్ కాబట్టే నువ్వు అంటూ సంభోదిస్తున్నారు.. దళిత స్పీకర్ కాబట్టే ఏకవచంతో పిలుస్తున్నారు అని మండిపడింది.
CM Revanth : కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు. బుధవారం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘చాలామంది సీరియస్ గా పనిచేయట్లేదు. ఒకసారి గెలవడం గొప్పకాదు. మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప. చాలా మంది బీఆర్ ఎస్ పట్ల సైలెంట్ గా ఉంటున్నారు. అలా చేస్తే మీ మీద అభ్యర్థిని పెట్టరు అనుకుంటున్నారా.. అలా అస్సలు ఊహించుకోకండి.…
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఎర్రవెల్లిలోని కేసీఆర్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాజకీయ పరిణామాలు, రానున్న ఉప ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గంభీరంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉప…
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిగా నిస్పాక్షికంగా జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సర్వేను ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో నిర్వహించిందని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. అయితే, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కావాలని సర్వేకు దూరంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో…
రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడటం లేదు.. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది.. ఇంపార్టెంట్ అయితే, సీఎం జోక్యం చేసుకుంటారు అని ఆయన వెల్లడించారు. మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్టు ఉంది.. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి.. నేను నిర్ణయం తీసుకునే ప్రోటోకాల్ పరిధిలో లేను.. కేవలం పార్టీ పరిధిలో ఉన్నాను అని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.
TG High Court: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది.