Congress: తెలంగాణ అసెంబ్లీ మాజీ మత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. బీఆర్ఎస్ అహంకారం ఇంకా తగ్గలేదు.. బీఆర్ఎస్ పార్టీకి దళిత స్పీకర్ పై గౌరవం లేదు అన్నారు. దళిత స్పీకర్ కాబట్టే నువ్వు అంటూ సంభోదిస్తున్నారు.. దళిత స్పీకర్ కాబట్టే ఏకవచంతో పిలుస్తున్నారు అని మండిపడింది. గతంలో గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు ఆయన కాళ్ళు మొక్కే వాళ్ళు.. బీఆర్ఎస్ నాయకులకు మహిళా గవర్నర్ అంటే గౌరవం లేదు.. ఆదివాసీ రాష్ట్రపతి అంటే గౌరవం లేదు… బీఆర్ఎస్ నాయకుల అహంకారం ఇంకా ఎప్పుడు తగ్గుతుందో మరి అని సీతక్క అన్నారు.
Read Also: IPL 2025-Uppal Stadium: ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు.. రూ.5 కోట్లతో రినోవేషన్ పనులు!
ఇక, స్పీకర్ ప్రసాద్ కుమార్ ను అవమానిస్తూ మాట్లాడిన జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.. గవర్నర్ ను స్పీకర్ ను అవమానిస్తున్నారు.. కేసీఆర్ చుట్టపు చూపుగా 6 నెలలకు సభకు వచ్చిండు.. సీఎం రేవంత్ రెడ్డి దమ్మున్న ముఖ్యమంత్రి.. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ప్రతి ఊరు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని చెప్పాడు.. తీసుకుంటే సిగ్గు పోతుందని దొంగ దారిలో సభను రద్దు చేశారు అని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. బ్రిటిష్ మహిళా టూరిస్ట్‌పై అత్యాచారం
అయితే, జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. దళితున్ని స్పీకర్ గా చేస్తే ఓర్వలేక దాడి చేస్తున్నారు.. లక్షలాది మంది దళితుల మనోభావాలను గాయపరిచే అంశం ఇది.. గతంలో సంపత్ కుమార్ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైనా అన్హరత వేటు ఎలా వేశారో.. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి పైనా కూడా వేయాలని కోరుతున్నాం అని డిమాండ్ చేశారు. కేసీఆర్ సభకు రాకపోవడం ఆయన వ్యక్తిగత విజ్ఞతకే వదిలేస్తున్నాం.. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఫామ్ హౌస్ లో పడుకోవడం ఎంత వరకు సబబు అని మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.