Jagadish Reddy: సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మండిపడ్డారు. కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయన్నారు.
మల్కాజ్గిరి మరోసారి రాజకీయ కక్షలతో రణరంగంగా మారింది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులను సందర్శించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై మౌలాలి కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. గత కొంతకాలంగా మౌలాలి డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు, తద్వారా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరి పొజేషన్ ఏంటో తెలిసిపోయింది. తాజా ఫలితాల్లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం ఛేజిక్కించుకుంది. ఇక ఇండియా కూటమి కూడా ఊహించని విధంగా సీట్లు సంపాదించింది.
KTR: గల్లిమే లుటో...డిల్లీకి బేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ శాఖలో కుంభ కోణం పై ఒక్కరూ మాట్లాడడం లేదన్నారు.
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా.. పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరగ్గా, కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పరకాల మండలం నాగారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ సెంటర్ దగ్గర బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడే…
KTR: ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ లూటీ స్టార్ట్ అయిందని ఎమ్మెల్యే కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలో పోటీ ఎవరెవరి మధ్య జరుగుతుందో ఆలోచించాలన్నారు.
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీ. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు.. నిన్న పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ.. రోహిత్ దళితుడే కాదని చెబుతోందని పేర్కొన్నారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నివాసం వద్ద మాజీ మంత్రిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన చెప్పారు. దేశంలో ప్రజా స్వామ్యం ఉందా.. నియంతృత్వ పోకడతో పాలన నడుస్తుంది.. దేశాన్ని రక్షించాలి అని ఆలోచన బీజేపీకి లేదు.. 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి? అని భట్టి విక్రమార్క అన్నారు.