Jagadish Reddy: సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మండిపడ్డారు. కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయన్నారు. స్థాయిలేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకతాయిలు చేసిన పనులకు కేటీఆర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వెనకాల ఉండి.. మంత్రులతో మాట్లాడిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. మంత్రి కొండ సురేఖ మాటలు రాజకీయ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. హామీల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ అని జగదీష్ రెడ్డి విమర్శించారు.
ఇక, ఎన్నికల హామీలు విఫలమై హైడ్రా.. హైడ్రా విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయ్ అని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి మానసిక స్థాయి సరిగ్గా లేదు.. నేటి మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్సే కదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కాదు.. ముందు సీఎం, మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలి అని ఎద్దేవా చేశారు. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలి అని మాజీమత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు.