Harish Rao: గురుకులంలో విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకులానికి చెందిన 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారంటూ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్ సంచలనంగా మారింది. మా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలలో అనేక అపోహలు.. అవాస్తవాలు ఉన్నాయని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోటికి వచ్చినట్లు మాట్లాడటం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు అని, హామీలు అమలు చేయమని అడిగితే నోటికి వచ్చినట్లు సీఎం తిడుతున్నారన్నారు. కేసీఆర్ పధకాలను రేవంత్ రెడ్డి కొనసాగించడం లేదని, రెండు పంటలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, రైతులకు రైతుబంధు రాలేదన్నారు. రాష్ట్రంలో పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదని హరీష్ రావు మండిపడ్డారు.
Duddilla Sridhar Babu : గత ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలివ్వలేదని విమర్శించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలుచ్చామని ఆయన తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు ముందు విద్యార్థులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయని, ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసారన్నారు.…
కేసీఆర్ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు.. ఏడు లక్షల కోట్లు అప్పుచేసి పోయిండని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇవాళ వికారాబాద్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నెలకు రూ.7 వేల కోట్లు మిత్తి కడుతున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే అని ఆయన వ్యాఖ్యానించారు.
హరీష్.. కేటీఆర్.. ఈటెలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మూడు నెలలు.. పేదలు కాళీ చేసిన ఇండ్లలో ఉండాలని.. కిరాయి తానే కడతానన్నారు. మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయాలన్నారు.
మూసి పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారన్నారు.
ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్సుకు చట్ట బద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసా పై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది.
Harish Rao: మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 65 మంది బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయట్లేదు అంటూ మండిపడ్డారు.