Bandi Sanjay : జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు 90 శాతం నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది
- జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించడం ఆశ్చర్యంగా ఉంది
- గ్రామాల్లో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు 90 శాతం నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నవంబర్ 26న అన్ని గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు… ఇవాళ ఆయన మాట్లాడుతూ… గ్రామాల్లో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు 90 శాతం నిధులిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే. గ్రామాల్లోని మొక్కల పెంపకం, రైతు వేదికలు, వైకుంఠధామాలు, రోడ్ల నిర్మాణం వంటివన్నీ కేంద్రం ఇస్తోన్న ఉపాధి హామీ పథకం నిధులతో జరుగుతున్నవే. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవి తమవిగా చెప్పుకుంటూ ఏడాది పాలనా విజయోత్సవాల పేరుతో ఉపాధి పనుల ప్రారంభించాలని ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. సొమ్ము కేంద్రానిదైతే… సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేక కేంద్రం నిధులతో అమలవుతున్న ఉపాధి పనులను విజయోత్సవాలుగా ప్రారంభించుకోవడం సిగ్గు చేటని అన్నారు.
I.N.D.I.A Alliance: మహారాష్ట్ర ఓటమితో అలిగిన టీఎంసీ.. ఆ బాధ్యత మమతా బెనర్జీకి ఇవ్వాలని డిమాండ్
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
అంతేకాకుండా..’నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి కూలీలకు సమున్నత లబ్ది చేకూరుతోంది. యూపీఏ హయాంలో గ్రామీణ పేదలకు ఉపాధి దూరమైతే.. ఎన్‌డీఏ పాలనలో కోట్లాది మందికి వరంగా మారింది. గత పదేళ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్క తెలంగాణలోనే దాదాపు రూ.30 వేల కోట్ల మేరకు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే. ఇంత గొప్ప పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేలా గొప్పగా ప్రకటనలు చేసుకోవడం సిగ్గుచేటు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉపాధి హామీ పథకం పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ప్రదర్శించాలి. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నింటికీ ప్రధానమంత్రి ఫొటో తప్పనిసరిగా ఉండేలా సర్క్యులర్ జారీ చేయాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజాక్షేత్రంలో అడుగడుగునా ఎండగడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం…’ అని ఆయన అన్నారు.
Minister Narayana: టౌన్ ప్లానింగ్‌లో సమూల మార్పులు.. సీఎం చేతికి కీలక రిపోర్ట్..
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!