Uttam Kumar Reddy : ప్రాజెక్టులు , రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణం ప్రారంభించాలని నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ…
మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేస్తారు.
TPCC Mahesh Goud : మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని వెల్లడించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈనెల…
ఓపిక పట్టండి సీరియల్‌గా ఒక్కొట్టి బయటకు వస్తుందని వికారాబాద్ ఘటన పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతన్నలు ధర్నాలు చేసియాల్సిన అవసరం లేదని, Msp రేటు కంటే అదనంగా గింజ లేకుండా ప్రభుత్వం కొంటుందని ఆయన వెల్లడించారు.
రైతు గర్జనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని విమర్శలు గుప్పించారు. రైతు బంధు, రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేస్తున్నామన్నారు.
Harish Rao: రాహుల్ గాంధీ మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్‌లోని నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే.. మీ సో-కాల్డ్ ప్రజా పాలనలో విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు.
Thatikonda Rajaiah : జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతుండు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని, నమ్మకద్రోహి, జిత్తులు మారి నక్కగా పేరున్న కడియం శ్రీహరి కేటీఆర్ పై మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.…
రుణమాఫీ చేస్తానని, రైతుబంధు పెంచి ఇస్తానని వాగ్దానాలన్నీ చేసి, ఇవ్వాళ పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వమన్నారని పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడని ఆయన మండిపడ్డారు.