Thatikonda Rajaiah : కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయింది…
- కేటీఆర్ పై కడియం నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నా
- కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయింది
- పార్టీలు మారడంలో కడియం శ్రీహరి మెరుపు వీరుడు.. హ్యట్రిక్ సాధించాడు : తాటికొండ రాజయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thatikonda Rajaiah : జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతుండు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని, నమ్మకద్రోహి, జిత్తులు మారి నక్కగా పేరున్న కడియం శ్రీహరి కేటీఆర్ పై మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ ప్రభుత్వం, అందుకే కేటీఆర్ పాదయాత్ర చేపడుతున్నారన్నారు. కేటీఆర్ పై కడియం నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు తాటికొండ రాజయ్య. కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయిందని, పార్టీలు మారడంలో కడియం శ్రీహరి మెరుపు వీరుడు,హైట్రిక్ సాధించాడన్నారు తాటికొండ రాజయ్య. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం అని ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్ కు ఎవరు చేయని నమ్మకద్రోహం చేసి 100 కోట్లకు అమ్ముడు పోయినా నికృష్టుడు కడియం శ్రీహరి అని, తాత ముత్తాతల నుండి ఆస్తి పరులైన కేసీఆర్, కేటీఆర్ పై కడియం శ్రీహరి స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడన్నారు.
IND vs NZ: టీమిండియా పరాజయం.. కోహ్లీపై విపరీతమైన ట్రోల్స్
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
అంతేకాకుండా..’కడియం శ్రీహరి భారత్ నుండి మలేషియా,సింగపూర్ కు హవాలా ద్వారా డబ్బులు పాపించి తన కూతురు అల్లుడు ద్వారా ఆస్తులు కొనుగోలు చేశారు… కడియం శ్రీహరి 1995లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతిపై కల్నాయకని ఒక పుస్తకం వచ్చింది… 1992లో రాజకీయాలకు వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు మీ ఆస్తి ఎంత… అప్పుడు గచ్చు నేలతో ఉన్న నీ ఇల్లు ఇప్పుడు 10 కోట్లతో హనుమకొండ నడి బొడ్డున ఎలా వచ్చింది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం కావడానికి కడియం శ్రీహరి సూత్రధారిగా అవుతాడు… స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్రహింసలకు గురి చేస్తుంటే వాళ్లు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు… నిన్ను గెలిపించిన ప్రజలకు మోసం చేసినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి… నీకు సిగ్గు శరం ఉంటే టిఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి… స్టేషన్ ఘనపూర్ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు… కేసీఆర్ కేటీఆర్ పై విమర్శలు చేస్తే ఖబర్దార్… టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్ను స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో తిరగకుండా చేస్తారు.’ అని తాటికొండ రాజయ్య అన్నారు.
Kolkata: ఆలస్యం కావడంతో బుకింగ్ క్యాన్సిల్ చేసిన మహిళ..అసభ్యకర వీడియోలు పంపిన డ్రైవర్
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!