బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని బీజేపీ అగ్రనేతలు కలిశారు. ఇటీవల అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అద్వానీకి అభినందనలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో తమ వివాహాన్ని గోప్యంగా పెట్టిన ఈ జంట పెళ్లి తరువాత అధికారికంగా తమ వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం క్యాట్ – విక్కీ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ…
మా ప్రభుత్వ చిత్తశుద్ధితోనే తెలంగాణ పురపాలికలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. వీరితో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయిలో అవార్డు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి…
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు చెందిన శిరీష అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగానూ నిలిచింది. అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో భారతీయురాలిగా గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందంలో శిరీష ఒకరు. టీమ్‌లో ఆమెతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు. కాగా శిరీషకు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ టీమ్ సక్సెస్ అవ్వాలని…
ఆర్చరీ దీపికా కుమారి ప్యారిస్ లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో గోల్డ్ మెడల్ సాధించింది. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ అందుకున్న దీపికా కుమారిని క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందించారు. సచిన్ టెండూల్కర్… దీపికను ట్విట్టర్ ద్వారా అభినందిస్తూ, టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లోనూ విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు అందించారు. సచిన్ తో పాటు దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్, మనోజ్ తివారి తదితరులు సైతం ఆర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో…