బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో తమ వివాహాన్ని గోప్యంగా పెట్టిన ఈ జంట పెళ్లి తరువాత అధికారికంగా తమ వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం క్యాట్ – విక్కీ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో విరుష్క వీరికి శుభాభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఈ కొత్త జంట కొత్త కాపురం ఎక్కడో విరుష్క జంట చెప్పేశారు.
అందమైన జంటకు శుభాకాంక్షలు.. మీరెప్పుడు ఇలాగె ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకోవాలి.. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగాలి.. హమ్మయ్య ఇప్పటికైనా మీ పెళ్లి అయిపోయింది. త్వరగా మా పక్కింటికి వచ్చేయండి.. ఇకనుంచి అర్ధరాత్రి ఏ శబ్దాలు తగ్గుతాయేమో” అంటూ చెప్పుకొచ్చారు. అంటే విరుష్క జంట ఉంటున్న పక్క ఇంట్లోనే కత్రినా – విక్కీ ఉండనున్నారంట.. ముంబైలోకి జుహు ప్రాంతంలో ఒక ఆధునాతన బిల్డింగ్ లో విరుష్క జంట నివసిస్తోంది. ఇక అదే బిల్డింగు లో కత్రినా ఒక ఇంటిని కొనుగోలు చేయడం, తమకు నచ్చిన విధంగా దాన్ని నిర్మించడం జరుగుతోందట .. నిర్మాణంలో ఉన్న ఈ ఇంట్లోనే కొత్తజంట కాపురం ఉండనున్నదంట. ఇక రిసెప్షన్ తరువాత కత్రినా- విక్కీ పలు ఆలయాల సందర్శించడం సహా కొన్ని రోజుల పాటు విహార యాత్రలు చేసి.. ఆ తర్వాత జుహులోని అపార్టుమెంటులోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.