MK Stalin: రాజకీయ లబ్ధి కోసం జాతీయ అవార్డులను ఉపయోగించుకోవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా ఎంపికైందని ఎంకే స్టాలిన్ విమర్శించారు. చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ అవార్డును వృథా చేయరాదన్నారు. వివాదాస్పద చిత్రంగా సినీ విమర్శకులు సైతం కొట్టిపారేసిన ఈ చిత్రానికి నేషనల్ ఇంటెగ్రిటీ నర్గీస్ దత్ అవార్డు రావడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గురువారం 69వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం ప్రకటించిన ఆవార్డులకు మొత్తం ఏడు భాషలు పోటీ పడగా.. తెలుగు సినిమాలకు 10 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల ప్రకటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు.
Read Also: Divorce: వేరు కాపురం అంటున్న భార్యలకు షాక్.. అలాంటి వారికి ఇక విడాకులే అన్న కోర్ట్
సాహిత్య రచనలు, సినిమాలు రాజకీయ రహితంగా ఉండాలని… ఎందుకంటే అవి మాత్రమే భావితరాలను ఉన్నతంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు. చౌకబారు రాజకీయాల కోసం జాతీయ అవార్డుల పరువు పోకూడదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడు సీఎం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జాతీయ అవార్డులు రాజకీయాలను ప్రభావితం చేయకూడదని అన్నారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న చిత్రాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని సీరియస్ అయ్యారు. ఎన్నికల వేళ కావాలనే సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీలో 69వ జాతీయ అవార్డులు -2021 ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో జాతీయ సమగ్రతా చిత్రంగా ది కశ్మీర్ ఫైల్స్ ఎంపిక అయింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం అవార్డును గెలుచుకోవడంపై రాష్ట్రంలోని అధికార డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోషల్ మీడియా పోస్ట్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయా విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న గాయని శ్రేయా ఘోషల్, సంగీత విద్వాంసుడు శ్రీకాంత్ దేవా మరియు ‘కడైసి వివాహాయి’ మరియు ‘సిర్పిగాలిన్ సిర్పంగల్’ బృందాలను సీఎం స్టాలిన్ అభినందించారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు స్టార్ అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అలియా భట్ (గంగూభాయ్ కాత్యవతి) మరియు కృతి సనన్ (మిమి) ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందించిన రాకెట్, ది నంబి ఎఫెక్ట్ ఉత్తమ చిత్రం, ఇందులో నటుడు ఆర్. నటించారు. ఈ చిత్రానికి మాధవన్ దర్శకత్వం వహించారు. మరాఠీ చిత్రం గోదావరికి గాను నిఖిల్ మహాజన్ ఉత్తమ దర్శకుడిగా, షాహి కబీర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును గెలుచుకున్నారు.