MP Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు. వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని తమ ఎంపీగా కోరుకుంటున్నారని అన్నారు. ‘వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోడీకి పోటీగా బరిలో దిగితే ప్రియాంక తప్పక గెలుస్తారు. రాయ్‌బరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టి పోటీ ఉంటుంద ని సంజయ్ రౌత్ చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భేటీపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మన ప్రధాని మోదీ సమావేశమయినప్పుడు.. శరద్, అజిత్ ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు. ‘పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోగా లేనిది.. శరద్ పవార్, అజిత్ పవార్ ఎందుకు కలుసుకోకూడదు. ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA) సమావేశానికి హాజరుకావాలని చెప్పడానికే అజిత్ పవార్‌ను శరద్ పవార్ కలిసి ఉంటారని తాను భావిస్తున్నానని.. దీనిపై శరద్ పవార్ త్వరలోనే మాట్లాడతారని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సహా మహారాష్ట్ర ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై సంతోషంగా లేరని అన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీచేస్తే తప్పకుండా ఆమె విజయం సాధిస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వారణాసి ప్రజలు ఆమెను కోరుకుంటున్నారని, ప్రధాని మోడీకి ప్రత్యర్ధిగా ఆమె పోటీ చేస్తే గెలుస్తారని రౌత్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో అమేథీ, రాయబరేలీలోనూ బీజేపీకి ఎదురీత తప్పదని జోస్యం చెప్పారు. ‘వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీ వాద్రాను కోరుకుంటున్నారు.. ఒకవేళ ఆమె మోడీపై పోటీ చేస్తే గెలుపు ఖాయం.. రాయబరేలీ, వారణాసి, అమేథీలో ఈసారి బీజేపీకి భంగపాటు తప్పదని సంజయ్ రౌత్ అన్నారు. ‘నా కుటుంబసభ్యుడు.. నా అన్న కుమారుడితో మాట్లాడితే తప్పేముంది.. ఇది ఎవరో నివాసంలో జరిగితే రహస్య అవుతుంది… నేను అతని నివాసంలోనే కలిశానని రౌత్ స్పష్టం చేశారు.