విశాఖ వేదికగా ప్రాంతీయ రెవెన్యూ సదస్సు ప్రారంభమైంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం లో సీసీఎల్ఏ, కలెక్టర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. రెవెన్యూ పరంగా ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, భూములకు సంబంధించిన సాంకేతిక సమస్యలపై చర్చించానున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల రెవెన్యూ రీజనల్ సదస్సు ప్రారంభంకు ముందు రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు కోసం నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన 135మందికి పత్రాలను అందించారు.
Read Also: Chicken bumper offer: అక్కడ చికెన్ కిలో రూ.99.. క్యూ కట్టిన జనం
రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో సంస్కరణలపై చర్చించేందుకు, ప్రభుత్వ విధానాలను క్లియర్ గా చెప్పేందుకు రీజినల్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అసైన్డ్ భూములపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. అసైన్డ్ భూములకు సంబంధించిన 77యాక్ట్ కు సవరణలను ప్రతిపాదిస్తాం అన్నారు. 22(ఏ)భూములపై సర్వే త్వరితగతిన జరుగుతోంది. సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్నారు.
ఆటో మ్యూటేషన్ విధానం ద్వారా సింగిల్ విండో రిజిస్ట్రేషన్ పద్ధతి అమలుచేస్తామన్నారు. భూములపై సమగ్రమైన వివరాలు సేకరించిన తర్వాతే ఇకపై రిజిస్ట్రేషన్ లు వుంటాయన్నారు. భూమి విలువ పెరగడం ద్వారా సర్వతోముఖాభివృద్ధికి కారణంగా మారింది. వివిధ కారణాలతో వివాదాస్పదంగా మిగిలిపోయిన భూములను వినియోగంలోకి తీసుకుని రావాలనేది సీఎం ఆలోచనగా ఉందన్నారు. సర్వే విభాగంలో ఉద్యోగాల భర్తీ ద్వారా బలోపేతం చేసాం. చుక్కల భూములు సహా హక్కులు కల్పించకుండా వుండి పోయిన సమస్యలు పరిష్కరించే ప్రక్రియ జరుగుతోందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Helmets For Sikh Soldiers: సిక్కు సైనికులకు హెల్మెట్?.. తీవ్రంగా వ్యతిరేకించిన గురుద్వారా