ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంగన్వాడీలకు కలెక్టర్లు నోటీసులు ఇచ్చారు. గత 22 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అంగన్వాడీల ఆందోళనతో పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని వారు తెలిపారు. గతంలో అనేక సందర్భాల్లో అంగన్వాడీల కోరికలను ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. అంగన్వాడీల సమ్మెతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు వంటి వారికి పౌష్టికాహారం అందించేందుకు ఇబ్బందులు వస్తున్నాని చెప్పారు. ఈ క్రమంలో.. అంగన్వాడీలు జనవరి ఐదు లోపు విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ లు నోటీసులు జారీ చేశారు. జనవరి ఐదు లోపు సమ్మె విరమించకపోతే ప్రభుత్వ నిబంధనల మేరకు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Breaking News: వైసీపీకి మాజీమంత్రి దాడి ఫ్యామిలీ గుడ్ బై..
ప్రభుత్వ నోటీసులపై అంగన్వాడీలు మాట్లాడుతూ.. జనవరి 5 లోపు అంగన్వాడీలు ఉద్యోగాల్లో చేరాలంటూ ప్రభుత్వ నోటీసులపై అంగన్వాడీల ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యల డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యోగాలలో చేరేదిలేదని తేల్చి చెబుతున్నారు. సమ్మె చేయడానికి ముందే నోటీసులు ఇచ్చాం.. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు తమకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. తమకు ఇచ్చే అరకొర జీతాల్లోనే పిల్లలకు, ఉప్పు పప్పు కొని వండి పెడుతున్నాం.. తమపై ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష కట్టిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏం చేస్తామన్న తాము వెనక్కి తగ్గేది లేదు.. ఒకటి రెండు ఉద్యోగాలు తీసేస్తారు… 1,32,000 మంది అంగన్వాడీల ఉద్యోగాలు తీసి మా పొట్ట కొడతారా అని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Delhi Crime: 26 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్..