మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఎంఆర్ కాలేజ్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో.. కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
CMR Engineering College: మేడ్చల్‌లోని CMR ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఏర్పడిన వివాదం చివరకు పోలీసుల జోక్యంతో సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో విద్యార్థినుల భద్రత పై ప్రశ్నలు తలెత్తాయి. హాస్టల్ నిర్వహణలో పారదర్శకత మరియు భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగినప్పటికీ, విద్యార్థినుల డిమాండ్లపై…
CMR Engneering College : మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్‌రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారు హాస్టల్‌లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని…