CMR Engineering College: మేడ్చల్‌లోని CMR ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఏర్పడిన వివాదం చివరకు పోలీసుల జోక్యంతో సర్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో విద్యార్థినుల భద్రత పై ప్రశ్నలు తలెత్తాయి. హాస్టల్ నిర్వహణలో పారదర్శకత మరియు భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగినప్పటికీ, విద్యార్థినుల డిమాండ్లపై కాలేజ్ యాజమాన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: BLN Reddy: ఫార్ములా-ఈ రేస్ కేసులో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్ ఇంజనీర్
ఇక పోలీసుల ఆధ్వర్యంలో ఘటన అనంతరం కాలేజ్ ప్రిన్సిపల్ ముందు పలు డిమాండ్లను విద్యార్థినులు ఉంచారు. హాస్టల్ నిర్వహణలో మార్పులను వారు కోరారు, అవి ఏంటంటే..
* తక్షణమే ప్రస్తుత వార్డెన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు.
* ప్రస్తుతం ఉన్న కెమెరాలను తొలగించి, కొత్త కెమెరాలను హాస్టల్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు.
* మెస్ సహా మొత్తం హాస్టల్ సెక్యూరిటీ బాధ్యతను మహిళా గార్డ్స్‌కు అప్పగించాలని కోరారు.
* హాస్టల్ గ్రౌండ్‌లో ఉన్న జ్యూస్, పానీపూరి సెంటర్లను తొలగించాలని డిమాండ్ చేసారు.
* హాస్టల్ లోపల కాకుండా వెలుపల ఏర్పాటు చేయాలని సూచించారు.
* సాయంత్రం 6 గంటల తర్వాత హాస్టల్ లోపల టెక్నీషియన్స్‌కు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేశారు.
* హాస్టల్ లోపల ఎక్కడైనా గోప్యమైన కెమెరాలు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత కోసం పూర్తి తనిఖీ చేయాలని సూచించారు.