టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ హైటెక్స్ వేదికగా ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఇప్పటికే ప్రత్యేక…
దళిత బంధు ప్రారంభమైనప్పటి నుంచి ఈ పథకంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ కి దళిత బంధు స్కీం పెద్ద తలనొప్పిగా మారింది. హుజురాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లను రాబట్టేందుకు స్కెచ్ వేసిన టీఆర్‌ఎస్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రతి పక్షాల అభ్యంతరం నేపథ్యంలో ఈ పథకానికి బ్రేకులు వేసింది ఎన్నికల సంఘం. అయితే.. ఈ పథకంపై అమలుపై మరో ట్విస్ట్ నెలకొంది. దళిత బంధుపై హైకోర్టు ను ఆశ్రయించారు పలువురు…
సీఎం కెసిఆర్ రాజకీయ జీవితం సమాధి చేస్తామని….కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి భయపడేది లేదని… అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పౌరుషం ఉంటే టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని… ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ను కేసీఆర్ మూడు ముక్కలు చేశారు, ఒక ముక్కను ఎంఐఎం కు ఇచ్చారని మండిపడ్డారు. విమోచన దినోత్సవాన్ని ఎందుకు…
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా అన్ని పార్టీలు భావించాయి. నేడో రేపో ఉప ఎన్నికలు ఉంటాయని అందరూ ఉత్కంఠగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈసీ బాంబు పేల్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల బైపోల్ ఇప్పట్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పడంతో అంతా ఊసురుమంటున్నారు. మరోవైపు ఉప ఎన్నిక వాయిదా ఏ పార్టీకి కలిసి వస్తుంది? ఇంకేవరికీ మైనస్ అవుతుందనే చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను…
టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా ? అనువైన రాజకీయ పరిస్థితుల కోసం గులాబీ పార్టీ ఎదురు చూస్తోందా ? టిఆర్ఎస్ ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2 న సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టిఆర్ఎస్ ప్రస్థానంలో ఢిల్లీలో…
టీటీడీపీని వీడిన ఎల్ .రమణ .. ఇవాళ టీఆరెస్ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన… తన అనుచరులతో కలిసి.. గులాబీ కండువా కప్పుకుంటారు. చేరికల కోసం తెలంగాణ భవన్‌లో నేడు ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రమణ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బలమైన బీసీ నేత కోసం .. టిఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.…
సిద్ధిపేట : మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మరోసారి మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అన్నం పెట్టింది కేసీఆర్, అ, ఆలు నేర్పింది కేసీఆర్, ఆయన బతికుండగానే సీఎం.. కావాలని ప్రయత్నం చేశాడని ఈటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఈటల రాజేందర్ కు టిఆర్ఎస్ ఏమి తక్కువ చేసిందని హరీశ్ రావు ప్రశ్నించారు. read also: తెలకపల్లి రవి : 124(ఎ)రాజద్రోహంపై సిజెఐ రమణ వ్యాఖ్యలు త్వరగా నిజమౌతాయా? ఈటల రాజేందర్…
తెలంగాణ కేబినెట్ ఇవాళ మళ్లీ భేటీకానుంది. నిన్న జరిగిన భేటీలో కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా, జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై ఇవాళ చర్చించనుంది కేబినెట్. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులను ఆదేశించిన కేబినెట్.. ఖాళీల భర్తీకి వార్షిక క్యాలెండర్ తయారు చేయాలని నిర్ణయించింది. గురుకులాల్లో స్థానిక నియోజకవర్గ విద్యార్థులకే 50శాతం సీట్లు కేటాయించ నున్నారు. read also : ఇవాళ అమిత్‌షాతో బండి…
దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయల య్యాయని… దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా హైదరాబాదుతో లింక్ ఉండటం కలవరపరుస్తోందని పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ తెలంగాణ సర్కారును అప్రతిష్టపాలు చేసే సిగ్గుచేటైన పరిణామాలు తప్ప మరొకటి కాదని… హైదరాబాదును విశ్వనగరం చేస్తామని ఏడేళ్ళుగా గప్పాలు కొడుతూ నెట్టుకొస్తున్న సీఎం కేసీఆర్ గారి సమర్థత ఈ నగర…