టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ హైటెక్స్ వేదికగా ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు.
సభా వేదిక చుట్టూ 8 పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలు గులాబీమయమైపోయాయి. ఎటు చూసినా భారీ ప్లెక్సీలు, ఆకట్టుకునే కటౌట్లే దర్శనమిస్తున్నాయి. సభావేదికను గ్రాండ్‌గా తీర్చిదిద్దారు టీఆర్ఎస్ నేతలు.ప్లీనరీకి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరవుతారు. వారికోసం నోరూరించే వంటకాలూ సిద్ధమవుతున్నాయి.మరోవైపు…ప్లీనరీలో ఆటా…పాటాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీనికి సంబంధించిన రిహార్సల్స్‌లో మునిగితేలుతున్నారు కళాకారులు.