తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి, వారి జీవితాల్లో గుణాత్మకమార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించి, రానున్న కాలంలో 40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సిఎం దళిత సాధికారత పథకం’ కోసం పటిష్టమైన కార్యాచరణ ను రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు సలహాలు అందించాలని, తనను కలిసి ధన్యవాదాలు తెలిపిన…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11:30 లకు అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ కి టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యులు చేశారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో.. ప్రభుత్వాలది, చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అని.. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని చెప్పారు. అందుకు బాధ్యులు పాలకులే అవుతారని సీఎం కెసిఆర్ తెలిపారు.…
తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి ఇవాళ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో ప్రారంభం కానున్న అఖిల పక్ష సమావేశం సుధీర్ఘంగా సాగనున్నది. read also :…
హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నికల అనివార్యం అయింది. ఉప ఎన్నిక తేదీ ఖరారు కాకముందే… అన్ని పార్టీలు హుజురాబాద్‌లో పాగ వేశాయి. విస్ర్తుత స్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నాయి. ఉద్యమంలో ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందనే… సెంటిమెంట్ ను ఈటల రాజేందర్ ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. అటు టీఆర్‌ఎస్… సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న బీజేపీలోకి ఈటల ఎందుకు వెళ్లారంటూ? ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ఈటలకు రాజకీయంగా…
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో లంచ్ వేదిక మార్పు వెనక కథేంటి? సీఎం ఇచ్చిన సంకేతాలు వెళ్లాల్సిన వారి చెంతకు వెళ్లాయా? ఓరుగల్లు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశాలేంటి? కడియం శ్రీహరి ఇంట్లో సీఎం కేసీఆర్ విందు! సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ అనగానే గుర్తొచ్చేది రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసం. 20 ఏళ్ల క్రితం ఉద్యమ సమయంలోను.. ఇప్పుడు సీఎం హోదాలో వరంగల్ వస్తే హంటర్ రోడ్డులోని కెప్టెన్ ఇంట్లో కేసీఆర్ దిగాల్సిందే.…
మహబూబ్ నగర్ పర్యటనలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల పై మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోడని.. లంకలో పుట్టినోళ్లు అందరు రాక్షసులేనని ఫైర్ అయ్యారు. ఆంధ్రోళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరుకోరని.. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణకు ఎవరూ అన్యాయం చేసినా.. ఊరుకునేది లేదని స్పష్టం…
తెలంగాణలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఈ నెల 25న ఆషాడమాసం బోనాలు నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత సంవత్సరం కరోనా కారణంగా బోనాలు నిర్వహించలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఘనంగా ఆషాడ బోనాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది తెలంగాణ సర్కార్. అటు జులై 11 న గోల్కొండ బోనాలు…
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసు హెడ్ క్వాటర్స్ దగ్గర పోలీసులు నిలిపివేశారు. వాహనం దిగి ఆర్ అండ్ బి అతిథిగృహం వరకు నడిచివెళ్లిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి… పోలీసులు తీరుకు నడిచివెళ్లి నిరసన తెలిపారు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు నేతలు. ఇది ఇలా ఉండగా.. సీఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు. తెరాస లేకుంటే నేను ఎక్కడ అని కొందరు అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాకు ఎమ్యెల్యే గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ పుణ్యమా అని ఎమ్యెల్యే గా గెలిచినా అని.. మొదటి సారీ గెలవడం ఈజి.. కానీ రెండవ సారీ గెలవడం కష్టమన్నారు. 2023 తరువాత టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. తరువాత వచ్చే ప్రభుత్వంలో వచ్చే స్కీం చాలా…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్ కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని, కేబినెట్ తీవ్రంగా ఖంఢించింది.…