రేపు విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహా విష్కరణకు అందరూ హాజరు కావాలి అని మంత్రి మేరుగు నాగార్జున కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరణ చేస్తారు అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారట.. ఈ నెల 25వ తేదీన భీమిలిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు వైసీపీ రెడీ అవుతోంది.
రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు.
ల్లుండి విజయవాడలో అంబేడ్కర్ మహా శిల్పం ఆవిష్కరణ జరగనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుది. ఈ సందర్భంగా సీఎం జగన్ అంబేడ్కర్ విగ్రహం గురించి మాట్లాడారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎల్లుండి భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు.