రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు.
పెనమలూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అన్నారు. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి పెనమలూరుతో నాకు సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.. వంగవీటి రంగా అనుచరుడిగా నేను ఇక్కడి వారికి పరిచయమే అన్నారు మంత్రి జోగి రమేష్
సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత కారణాలు వారికున్నాయన్నారు వైవీ.. సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారన్న ఆయన.. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచి సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారని గుర్తు చేశారు. సీట్లు ఇవ్వని వారు కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది.. కానీ, అన్నీ సర్దుబాటు అవుతాయన్నారు.
సంక్రాంతి తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు జిల్లాల చొప్పున సీఎం పర్యటించనున్నారు.