సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అంబేడ్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని సీఎం వెల్లడించారు.
కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో నా సోదరుడు ప్రసన్నకుమార్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు అంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజేంద్రకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో కోవూరులో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తుతూ.. ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన.. మరోవైపు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ప్రశంసల వర్షం కురిపించారు.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందన్నారు యార్లగడ్డ..