అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. డ్వాక్రా సంఘాల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని.. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు
ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళుర్పించారు. నేతాజీకి నివాళులర్పిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటించనున్నారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు.. వరుసగా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తూ వస్తున్న ఆయన.. రేపు ఉరవకొండ వేదికగా.. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన దొరబాబు.. అప్పటి నుంచి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఆ తర్వాత సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.. అయితే, మరోసారి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? ఆ దిశగా ప్రత్యామ్నాయ ఆప్షన్స్ పై దృష్టి పెట్టారా? అనే చర్చ సాగుతోంది..
ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం.. ఆయన్ని కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామం జరిగిన తర్వాత 4 రోజులు బెంగుళూరులో ఉన్న జయరాం.. ఆ తర్వాత ఆలూరులో మూడు రోజులు గడిపారు. ఇదే సమయంలో ఆలూరు వైసీపీ తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదట