MLA Pendem Dorababu: వైసీపీలో ఇంఛార్జిల మార్పు వ్యవహారంలో కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు మొదట్లో కొంత హల్‌చల్ చేసి.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు.. పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన ఆయన.. అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో దొరబాబు బలప్రదర్శనకు ఈ కార్యక్రమం వేదికైందనే చర్చ సాగింది.. పిఠాపురం సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలి.. నియోజకవర్గంపై నాకే ఎక్కువ పట్టుంది.. అందుకే వేలాది మంది నా పుట్టిన రోజు వేడుకలకు తరలివచ్చారని.. పిఠాపురం టికెట్ మళ్లీ నాకే ఇస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.. అయితే, ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలుకు దూరంగా ఉంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు.
Read Also: Train derail: కేరళలో పట్టాలు తప్పిన కన్నూర్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్ ట్రైన్..
తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన దొరబాబు.. అప్పటి నుంచి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఆ తర్వాత సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.. అయితే, మరోసారి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? ఆ దిశగా ప్రత్యామ్నాయ ఆప్షన్స్ పై దృష్టి పెట్టారా? అనే చర్చ సాగుతోంది.. అది నిజమే అని తెలుస్తోంది.. ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారట దొరబాబు.. అనుచరుల సూచనల మేరకు పోటీపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా, పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కోఆర్డినేటర్ గా వంగా గీతను నియమించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు.. ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి సీఎంవో నుంచి ఫోన్ వచ్చినట్టు చెబుతున్నారు.. ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి సీఎంవోకి రావాలని దొరబాబుకి ఫోన్ వచ్చిందట.. మరోవైపు.. నిన్నటి నుంచి తాడేపల్లిలోనే ఉన్నారు పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్, ఎంపీ వంగా గీత.. పిఠాపురంలో రాజకీయ పరిణామాలు పార్టీ పెద్దలకు వివరించారు.. సీఎంవో నుంచి ఫోన్ రావడంతో.. తాడేపల్లికి బయల్దేరినట్టుగా తెలుస్తుండగా.. సీఎం వైఎస్ జగన్‌ను కలవడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. దొరబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టింది వైసీపీ అధిష్టానం.. మరి.. ఈ రోజు ఎలాంటి చర్చ సాగుతోంది.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.