వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన.. రేపు ఒంగోలు వెళ్లనున్నారు.. ఇక, శుక్రవారం ఒంగోలు వేదికగా.. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం వైఎస్ జగన్.. దీనికోసం రేపు ఉదయం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి.. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.. అక్కడ జరిగే బహిరంగ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్రారంభించారు… అనంతరం కీలక ప్రకటన చేశారు.. 131 మంది ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.. గతంలో బలభద్రపురంలో కాలుష్య పరిశ్రమ వద్దంటూ కేపీఆర్ వ్యతిరేక ఉద్యమం జరిగింది.. ఈ సందర్భంగా 131 మందిపై…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం… దేవుడి ఫొటో బదులు సీఎం జగన్ ఫొటో పట్టుకుని చాంబర్‌లోకి ప్రవేశించారు.. చాంబర్‌లో ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్లు చేశారు.. ఇది రెడ్ల రాజ్యం కాదు.. బడుగుల రాజ్యం.. జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఇక, బడుగులకు జగన్…
రెవిన్యూ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అవినితి ఎక్కువగా ఉందని, ఇది అవమానకరంగా ఉందన్నారాయన.. అందుకే అనేక పథకాలను.. లబ్ధిదారులకే నేరుగా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అయితే, ఇదే సందర్భంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ధర్మాన.. ప్రజలు నిజాయితీ కలిగిన నాయకులను కోరుకుంటున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేసిన ఆయన.. ఇది కేవలం ఆయన నిజాయితీవల్లే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో ఆప్…
వైఎస్ జగన్ కేసుల్లోనూ సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది భద్రత పెంచండి అంటూ సీబీఐ అధికారులకు సూచించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. కాకాని కేసులో సాక్ష్యాలని కోర్టు నుంచే దొంగిలించడం దుర్మార్గం అని పేర్కొన్న ఆయన.. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి పోతుందనే భయంతోనే కోర్టులో ఉన్న సాక్ష్యాలను దొంగిలించారని ఆరోపించారు. జగన్ కేసుల్లో కూడా సాక్ష్యాలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది.. సీబీఐ వాళ్లు ఆ సాక్ష్యాలకు మరింత భద్రత ఏర్పాటు చేయాలన్నారు.. వైఎస్…
ప్రభుత్వ పథకాలు, విధానాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అమ్మ ఒడి పథకంపై సెటైర్లు వేశారు.. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకం తీరు అని దుయ్యబట్టారు.. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్థ ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం…
సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ సీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం మోపుతున్నాయన్నారు.. మూడేళ్ల పాలనలో మద్యం రేట్లు మూడు వందల శాతం పెంచారంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.. ఇక, మంత్రివర్గ విస్తరణలో సత్య సాయి జిల్లాకు సీఎం వైఎస్ జగన్ అన్యాయం…
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధిస్తాం…రాష్ట్రానికి.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మంచి పేరు తీసుకొస్తాను అని వెల్లడించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు… సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. 2026 వరకూ పాత జిల్లాల్లోనే జెడ్పీలను కొనసాగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పంచాయితీల్లో తాగునీరు పారిశుద్ధ్యం మెరుగు పరుస్తామని…
రెండు రోజుల పాటు కడప, కర్నూలు జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఇవాళ సాయంత్రం కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ఆయన.. 5.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఇక, రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి.. రాత్రి 7.30 నుంచి 7.40 గంటల మధ్య కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు.. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
ఇవాళ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.. ఇక, ఈ రోజు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్మ.. సీతారాములకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. కాగా, కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆంక్షలు నేపథ్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకుండా పోయింది.. కానీ, ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉండడంతో.. ఈ ఏడాది భక్తుల సమక్షంలో రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ.. ఇవాళ…