ఇవాళ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.. ఇక, ఈ రోజు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్మ.. సీతారాములకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. కాగా, కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆంక్షలు నేపథ్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకుండా పోయింది.. కానీ, ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉండడంతో.. ఈ ఏడాది భక్తుల సమక్షంలో రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ.. ఇవాళ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.. పండువెన్నెల్లో సీతారాముల కళ్యాణం నిర్వహించడం.. ఒంటిమిట్టలో ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?