ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందర్నీ శోక సంద్రంలో ముంచెత్తింది.. ఎంతో భవిష్యత్ ఉన్న నేత.. మరణాన్ని అటు కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక, ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి.. అన్న వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నా.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి,…
ముందస్తు ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసిన ఆయన.. 2024లోనే ఎన్నికలు ఉంటాయన్నారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి… ఈ ఏడాది చివరిలోగా దశల వారీగా 2 లక్షల 16 వేల టిడ్కో ఇల్లులు లబ్ధిదారులకు అందిస్తాం అన్నారు. ఈ ఏడాది మే నాటికి 40 వేల ఇళ్లు పూర్తి చేస్తాం…
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు… ఇక, సుమారు గంట పాటు గవర్నర్-సీఎం మధ్య చర్చలు జరిగాయి.. సమకాలిన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా చర్చించారు.. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన.. ప్రజలకు మరింత చేరువైనట్టు గవర్నర్ కు వివరించారు సీఎం జగన్.. నూతన జిల్లాల్లో…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్ వ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారన్న ఆయన.. వైసీపీ పార్టీ నాయకులు చెప్పిన వారిని వాలంటీర్లుగా నియమించామని తెలిపారు. ఇక, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే దానికి ముఖ్య కారకులు వాలంటీర్లే అన్నారు బాలినేని.. అంతేకాదు.. గడప గడపకే నేను తిరుగుతాను.. కానీ, నన్ను…
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు అంటూ ఫైర్ అయ్యారు మనోహర్.. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన ఆయన.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు…
2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 175 ఎందుకు గెలవకూడదు అని ప్రశ్నించారు.. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెటైర్లు వేస్తోంది… సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పార్టీకి 175 స్థానాలు ఎలా వస్తాయి..? అని…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులను బిజీ చేయడమే కాదు.. తాను బిజీగా గడుపుతున్నారు.. అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు.. ఇక, గురువారం రోజు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి… సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఆయన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. Read Also: KCR: టీఆర్ఎస్ సుసంపన్న పార్టీ.. ఒక్క పిలుపిస్తే రూ.600 కోట్లు..! రేపు ఉదయం…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సీబీఐ దత్తపుత్రుడు పాలన చేస్తున్నారా..? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా..? అని ఫైర్ అయిన ఆయన.. రైతుల నుంచి నీటి తీరువాను వడ్డీ విధించి వసూలు చేస్తున్నారు.. అసలే, గిట్టుబాటు ధరలు రాక.. పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తారా? 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల…
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 2024 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుంది.. అందులో భాగంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నద్ధత సమావేశం నిర్వహించారు.. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో భేటీ అయ్యారు సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతోన్న…