ముందస్తు ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసిన ఆయన.. 2024లోనే ఎన్నికలు ఉంటాయన్నారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి… ఈ ఏడాది చివరిలోగా దశల వారీగా 2 లక్షల 16 వేల టిడ్కో ఇల్లులు లబ్ధిదారులకు అందిస్తాం అన్నారు. ఈ ఏడాది మే నాటికి 40 వేల ఇళ్లు పూర్తి చేస్తాం అన్నారు. అయితే, 5 లక్షల ఇళ్లు కడతామని గత ప్రభుత్వం చెప్పింది.. కానీ, 3.13 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగితే.. ఎక్కడా 10 శాతం కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారని మండిపడ్డారు.. చ౦ద్రబాబుది మసిపూసి మారడుకాయ చేసే నైజ౦ అంటూ దుయ్యబట్టారు. టిడ్కో ఇళ్ల విషయంలో లక్షల కోట్ల రూపాయలను వృథా చేస్తున్నమాని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Read Also: Andhra Pradesh: గవర్నర్‌తో సీఎం భేటీ.. గంట పాటు చర్చలు..