పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచారు.. అయితే, చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం, ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎంత మంది కలిసినా 2024లో వచ్చేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేననే నమ్మకాన్ని వ్యక్తం…
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడూస్తూనే ఉంది.. ఓవైపు కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకో వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పెరిగిన ధరలపై బాదుడే బాదుడు పేరుతో ఉద్యమం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూంది.. అయితే, కుళ్లు, కుతంత్రాలతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం వల్ల జగన్‌కు, వైసీపీ నేతలకు ఆత్మ సంతృప్తి…
గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌తో పాటు ప్రశ్నాపత్రలు లీక్ అయ్యాయి. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి, ఏదో ఒక చోట క్వశ్చన్ పేపర్స్ లీకమవుతూ వస్తున్నాయి. దీంతో, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పదో తరగతి పరీక్షల్లో లీక్, మాస్ కాపీయింగ్‌తో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని ఆ…
ఇటీవల గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో రాజకీయంగా అగ్గి రాజుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరాలు చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తుండగా, వైసీపీ నేతలు అందుకు తగ్గ రీతిలోనే కౌంటర్స్ వేస్తున్నారు. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Read Also: TS Inter Exams: ఇంటర్ పరీక్షలు.. ఆ నిబంధన…
ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవీయతో సమావేశం అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్… రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న తర్వాత కేంద్ర మంత్రితో భేటీ అయిన ఆయన.. వైద్యకళాళాలలకు అనుమతులపై చర్చించారు.. ఈ మేరకు కేంద్రమంత్రికి లేఖ అందించారు ఏపీ సీఎం.. విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాల కొరత ఏర్పడిందని.. దీని కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.. కోవిడ్…
సీఎం వైఎస్ జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. ఏపీ సీఎంకు జీవితాంతం బీసీలు తోడుగా ఉంటారని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజిని.. గుంటూరులో జరిగిన ముదిరాజ్ మహాసభ సన్మానానికి హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. బీసీలకు ఇచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్లు, 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశంసలు కురిపించిన ఆమె.. ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా లబ్ధిపొందుతున్నది బీసీలే…
మేం సిగ్గు పడుతున్నాం.. అధికారులుగా మీకు ఉందో లేదో నాకు తెలియదు అంటూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన.. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రారంభిస్తామని అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని.. తప్పుడు సమాచారం ఇచ్చి.. ముఖ్యమంత్రి చేత తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్…
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. అయితే, రమ్య కేసు తీర్పు పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని…
గన్ కంటే ముందే దూసుకువస్తానన్న జగన్ ఎక్కడా.. ? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వెళ్లిన ఆయన.. దుండగుల అఘాయిత్యానికి బలైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.. అయితే, లోకేష్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ దశలో టీడీపీ-వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నాయి.. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.. ఇక, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. చట్టాలంటే…