ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవీయతో సమావేశం అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్… రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న తర్వాత కేంద్ర మంత్రితో భేటీ అయిన ఆయన.. వైద్యకళాళాలలకు అనుమతులపై చర్చించారు.. ఈ మేరకు కేంద్రమంత్రికి లేఖ అందించారు ఏపీ సీఎం.. విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాల కొరత ఏర్పడిందని.. దీని కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య వ్యవస్థ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన.. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది.. ప్రాథమిక, ద్వితీయ స్థాయిల్లో ఆస్పత్రులను మెరుగుపరుస్తోందన్నారు. పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌లు, డీహెచ్‌లు, అంతేకాక ప్రస్తుతం ఉన్న బోధనాసుపత్రులను, నర్సింగ్‌కాలేజీలను అభివృద్ధిచేస్తోందని వెల్లడించారు.
Read Also: Temperature: ఎండలు బాబోయ్ ఎండలు.. 122 ఏళ్ల రికార్డ్బ్రేక్..
మరోవైపు, గణనీయ రీతిలో ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్ జగన్.. ప్రతి జిల్లాలకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా అత్యాధునిక వైద్యంకోసం అవసరమైన నిపుణులు, ఆరోగ్య సేవలు అందించే మానవవనరులు తయారవుతాయని.. ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం… మొత్తంగా ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి.. రాష్ట్రంలో ఇదివరకే 11 మెడికల్ కాలేజీలు ఉండగా, కేంద్రం పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్తగా మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది.. కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని మిగిలిన 12 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. జిల్లాల విభజన తర్వాత ప్రజారోగ్య వ్యవస్థ పరంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి మరియు నంద్యాల జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవని.. 2023 డిసెంబర్ నాటికి ఈ కాలేజీల నిర్మాణాలను పూర్తిచేస్తాం, 2024 అడ్మిషన్లకు వాటిని సిద్ధం చేస్తాం. వీలైనంత త్వరగా అనుమతులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్ జగన్.