బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. అయితే, రమ్య కేసు తీర్పు పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్న ఆయన.. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు.. ఈ మేరకే ట్వీట్ చేశారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Breaking: బీటెక్ విద్యార్థిని హత్య కేసులో సంచలన తీర్పు
విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2022