సీఎం వైఎస్ జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. ఏపీ సీఎంకు జీవితాంతం బీసీలు తోడుగా ఉంటారని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజిని.. గుంటూరులో జరిగిన ముదిరాజ్ మహాసభ సన్మానానికి హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. బీసీలకు ఇచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్లు, 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశంసలు కురిపించిన ఆమె.. ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా లబ్ధిపొందుతున్నది బీసీలే అన్నారు.. జీవితాంతం బీసీలంతా సీఎం జగన్ కు తోడుగా ఉంటారని.. బీసీల మద్దతు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే అన్నారు మంత్రి విడదల రజిని.
Read Also: Somireddy: కేటీఆర్ ఎపిసోడ్.. సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక, దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. ముదిరాజ్‌లకు న్యాయం చేసింది నాడు వైఎస్సార్, ఇప్పుడు వైఎస్ జగన్ అన్న ఆయన.. బీసీలంతా వైఎస్ జగన్‌కు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు బీసీలు సిద్ధంగా ఉండాలన్నారు. బీసీలకు ఎన్నడూ లేనంతగా వైసీపీలోనే ప్రాధాన్యత దక్కిందని పేర్కొన్నారు కాసాని జ్ఞానేశ్వర్.