Rahul Gandhi: కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘‘40% కమీషన్’’ ఆరోపణలు సహకరించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతీ విషయంలో కమీషన్ తీసుకుంటుందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఆర్థిక మంత్రి హోదాలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులకు 100 కోట్ల రూపాయలు.. క్రైస్తవ సమాజానికి 200 కోట్ల రూపాయల కేటాయించారు.
Karnataka: కర్ణాటక మాండ్యా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని కేరగోడు గ్రామంలో ప్రజలు 108 అడుగుల ఎత్తున హనుమాన్ జెండాను ఆవిష్కరించారు. అయితే, ఈ రోజు తెల్లవారుజామున స్థానిక అధికారులు ఈ జెండాను తొలగించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాషాయ జెండాను ఎగరేసినందుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు బలవంతంగా జెండాను తీయించారు.
అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము గాంధీ రాముడిని పూజిస్తాము, బీజేపీకి చెందిన రాముడిని కాదు" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బెంగళూర్‌లో నెలకొల్పుతున్న కొత్త కొత్త బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (BIETC) క్యాంపస్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ‘హిందూ వ్యతిరేకి’ అంటూ అక్కడి బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కర్ణాటక బీజేపీ యూనిట్ సీఎం సిద్ధరామయ్య గుడిలోకి వెళ్లేందుకు నిరాకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతర మంత్రులు, పూజారి లోపలకి ఆహ్వానించినప్పటికీ సీఎం గుడి ప్రవేశద్వారం వద్ద నిలబడి ఉన్న వీడియోని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
Hijab: హిజాబ్ అంశం మరోసారి కర్ణాటకలో వివాదాస్పదం అవుతోంది. గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాలయాల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. నిన్న సీఎం సిద్ధరామయ్య మైసూరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మహిళలు కావాలంటే హిజాబ్ ధరించవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో విద్యాలయాల్లో కూడా హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
Hijab: గతేడాది కర్ణాటకలో హిజాబ్ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయ విమర్శలకు దారి తీసింది. పాఠశాల్లలో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై అప్పటి బీజేపీ సర్కార్ నిషేధం విధించింది. ఇదే అంశాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది.