CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అససరాల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని శుక్రవారం మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఆకాంక్షలను, అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించినప్పటికీ.. కేంద్రం రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tiger claw row: ‘పులిగోరు’ వివాదం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రాజ్యసభ ఎంపీ, నటుడు జగ్గేష్ టీవీ లైవ్ షో ఇంటర్వ్యూలో పులి-గోరు లాకెట్ ధరించి కనిపించడంతో అతని ఇంట్లో అటవీ శాఖ సోదాలు చేసింది. అంతకుముందు కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా ఇలాంటి లాకెట్ ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ఇంట్లో కూడా అటవీ శాఖ…
HD Kumaraswamy: జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు.
కర్నాటకలోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటనను ప్రభుత్వం దీనిని "తీవ్రమైన సంఘటన" అని పేర్కొంది. ఆదివారం ప్రమాద స్థలాన్ని డిప్యూటీ సీఎం డికె శివకుమార్ సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నారు
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమై 5 వాగ్ధానాల్లో ఒకటైన ‘గృహ లక్ష్మీ’ పథకాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం 2023-2024 ప్రభుత్వ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో, మొత్తం 18 శ్లాబ్‌లపై ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)పై ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు.
Karnataka: ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ పథకాన్ని ఆదివారం సీఎం సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు.
Karnataka: కర్ణాటకలో మరోసారి మోరల్ పోలీసింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ వివిధ మతాలకు చెందిన ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి భోజనం చేయడం పట్ల కొందరు తీవ్ర మనస్తాపానికి గురై గొడవ సృష్టించి ఇద్దరినీ విపరీతంగా వేధించారు.
Karnataka Cabinet Expansion: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రచ్చ మొదలైంది. నిన్నటి నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం వేశారు.
Bengaluru: బెంగళూర్ లో అధికారం వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరం మొత్తం భారీ వర్షం తడిసిముద్దైంది. పలు ప్రాంతాల్లో అండర్ పాసుల కిందికి నీళ్లు చేరాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ వర్షం వల్ల ఆంధ్రప్రదేశ్ కు చెంది టెకీ భానురేఖ మరణించారు.