తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. నేటి నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు. నేడు ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్న బీజేపీ. రేపు జిల్లా స్థాయిలో ఛార్జ్‌షీట్ విడుదల. డిసెంబర్ 2,3న అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు. నేడు దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్‌లో డీజీపీ-ఐజీపీల సదస్సు.. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత, జాతీయ భద్రతపై ప్రసంగించనున్న ప్రధాని మోడీ నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్. హాజరుకానున్న పురంధేశ్వరి, కె.లక్ష్మణ్, శివప్రకాష్.…
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు.
Telangana Government: వికారాబాద్ జిల్లా లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా గ్రామాల్లో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.
CM Revanth Reddy: రాష్ట్ర సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. విగ్రహానికి తుది మెరుగులు దిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అమరావతి: నేడు సోషల్‌మీడియా కేసులపై విచారణ. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించనున్న హైకోర్టు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి సహా ఇతరుల ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ. కడప: సీఎం వద్దకు చేరిన ఫ్లయాస్ పంచాయతీ. ఇవాళ సీఎంవో ఆఫీస్‌కు రావాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూపేష్రెడ్డిలకు అధిష్టానం పిలుపు. తెలుగు రాష్ట్రాల్ల నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,340 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో బాగానే ఉన్నా... ఇటీవల వరుసగా రెండు, మూడు ఊహించని ఘటనలు జరిగాయి. లగచర్లలో రైతులు కలెక్టర్ పై తిరగబడడంతో సమస్యలు మొదలయ్యాయి. కలెక్టర్‌ని తప్పుదోవ పట్టించి రైతులు లేని దగ్గరికి తీసుకెళ్లి దాడి చేశారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరించారని, కలెక్టర్‌పై దాడికి అదే కారణం తేల్చింది సర్కార్. రెండు మూడు రోజులపాటు ఈ ఎపిసోడ్ చుట్టూనే తిరిగింది తెలంగాణ రాజకీయం మొత్తం.…
మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ డెవలప్మెంట్ పైన పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తాము.. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నామని రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి చెప్పారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు.